అందుకే గుంజీలు తీశా..వైరల్ అవ్వాలనే ఉద్దేశం లేదు.. హెడ్మాష్టర్
విజయనగరం జిల్లాలో జడ్పీ స్కూల్‌లో హెడ్మాష్టర్ విద్యార్థులకు సాష్టాంగనమస్కారం చేసి, గుంజీలు తీసిన ఘటన సంచలనం కలిగించింది. విద్యార్థులు సరిగా చదవడం లేదని, క్రమశిక్షణ లేదనే ఆవేదనతో ఆయన ఇలా చేసినట్లు చెప్పారు. తమ పాఠశాల విద్యార్థులు ప్రతీ సంవత్సరం త్రిపుల్ ఐటీలో సీట్లు సాధిస్తారని, కానీ ఈ ఏడాది వారు సరిగా చదవడం లేదని, వెనకబడ్డారని టీచర్లు చెప్పడంతో, వారిని దారిలో పెట్టేందుకే అలా ప్రవర్తించానని పేర్కొన్నారు. వారిని కొట్టినా, తిట్టినా లాభం లేదని భావించి దండం పెట్టి గుంజీలు తీశానని దీనివల్ల వారి మనసు మారి చదువుపై శ్రద్ధ పెడతారని ఆశిస్తున్నట్లు చెప్పారు. అంతేకానీ వార్తల్లోకెక్కడానికో, వైరల్ అవడానికో కాదని స్పష్టం చేశారు.

