వైసీపీకి విజయమ్మ రాజీనామా
ప్లీనరీ వేదికగా వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు విజయమ్మ. తెలంగాణలో షర్మిలకు అండగా ఉండేందుకు రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ఇకపై తెలంగాణలో షర్మిలతోనే రాజకీయాలన్నట్టుగా తేల్చేశారు విజయమ్మ. తల్లిగా జగన్‌కు ఎల్లప్పుడు మద్దతిస్తానన్నారు. ఇద్దరూ వేర్వేరు రాష్ట్రాలకు, వేర్వేరు పార్టీలకు ప్రతినిధులుగా ఉన్నారన్నారు. ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదన్నారు విజయమ్మ. వక్రీకరణలకు, విమర్శలకు తావివ్వొద్దనే రాజీనామా చేస్తున్నానన్నారు.