“కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు”: పవన్ కళ్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రానికి కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఏపీ రాజధాని నిర్మాణానికి రూ.15 వేల కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.దీంతో పవన్ కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు ఏపీలోని ఎన్డీయే కూటమి కార్యకర్తలు కూడా ఏపీకి కేంద్ర బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించినందుకు సంబరాలు చేసుకుంటున్నారు.

