వైఎస్సార్ ఉండి ఉంటే… కేసీఆర్, మోదీకి బుద్ధి చెప్పేవారు
దేశానికి వైఎస్సార్ దిశా నిర్దేశం చేశారని… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సత్తా చాటారని… ఢిల్లీలో తెలుగు ప్రజలకు మరింత గుర్తింపు తెచ్చారన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి సందర్భంగా, కాంగ్రెస్ నేతలతో కలిసి నివాళులు అర్పించారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను దేశమే ఆదర్శంగా తీసుకుందని, ఆయన తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉన్నారన్నారు. వైఎస్సార్ ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచించేవారని కొనియాడారు. జలయజ్ఞం ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందించారని సంక్షేమం, అభివృద్ది రెండు కళ్లని ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు రేవంత్. మోదీ, కేసీఆర్‌లు కాంగ్రెస్‌పై కుట్రలు చేస్తున్నారని వైఎస్ ఉంటే వాటిని తిప్పికొట్టేవారన్నారు.