Andhra PradeshNews

అనంతపురంలో టెస్లా యూనిట్లు

ఏపీ మంత్రి లోకేశ్ అమెరికా పర్యటనలో భాగంగా వివిధ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో నెంబర్ ఒన్‌గా ఉన్న టెస్లా కంపెనీ సీఎఫ్‌వోతో జరిగిన సమావేశంలో ఏపీలోని అనంతపురంలో టెస్లా యూనిట్లు ఏర్పాటు చేయాలంటూ కోరారు. ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీ యూనిట్లకు అనంతపురం జిల్లా వ్యూహాత్మక ప్రదేశంగా ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో టెక్నాలజీ పార్కులు ఏర్పాటు చేయాలని టెస్లా సీఎఫ్‌వోకు విజ్ఞప్తి చేశారు లోకేశ్.

పెరోట్ గ్రూప్ అండ్ హిల్‌వుడ్ డెవలప్‌మెంట్ ఛైర్మన్ రాస్ పెరోట్ జూనియర్‌తో కూడా ఆయన సమావేశమయ్యారు. ఏపీలో ప్రభుత్వ- ప్రైవేట్ భాగస్వామ్యంలో పోర్టులు, హైవేలు, పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరారు.