అమెరికాలో ఆంధ్రా పవర్
తెలుగు బిడ్డ అమెరికాలో అత్యున్నత పదవికి ఎంపికయ్యారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీకి పక్కనే ఉన్న మేరీ ల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించారు అరుణా మిల్లర్… అమెరికాలో అత్యున్నత స్థాయిలో తొలి భారతీయ-అమెరికన్ రాజకీయ నాయకురాలు అరుణా మిల్లర్ నిలిచారు. మేరీల్యాండ్ హౌస్‌కు మాజీ ప్రతినిధిగా, డెమోక్రటిక్ గవర్నర్ ఎన్నికైన వెస్ మూర్‌తో పాటు లెఫ్టినెంట్ గవర్నర్ బరిలో నిలిచారు. గవర్నర్ మరణించినా, రాజీనామా చేసినా లేదా పదవి నుండి తొలగించబడినా లెఫ్టినెంట్ గవర్నర్ కూడా గవర్నర్ అయ్యే అవకాశం ఉంటుంది. మంగళవారం సాయంత్రం పోలింగ్ ముగిసిన వెంటనే, మూర్, మిల్లర్ రిపబ్లికన్ అభ్యర్థులపై విజయం సాధించినట్టుగా ప్రకటించారు. అధ్యక్షుడు జో బిడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఇద్దరూ మూర్, మిల్లర్‌లకు అనుకూలంగా ప్రచారం చేశారు. మేరీల్యాండ్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ రేసులో గెలుపొందడంలో, మిల్లెర్ చివరి నిమిషం వరకు గట్టిపోటీని ఎదుర్కొంది. ఎన్నికల్లో గెలిచేందుకు హిందూ జాతీయవాదులను ఆశ్రయించారంటూ వచ్చిన ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు.

వాస్తవానికి, మేరీల్యాండ్‌లోని భారతీయ-అమెరికన్‌లలో ఆమె ప్రజాదరణ ద్వైపాక్షికమైనది. అరుణా కోసం అటు డెమొక్రట్లతోపాటు, ట్రంప్, రిపబ్లికన్ మద్దతుదారులు మద్దతుగా నిలవడంతోపాటు… నిధులు సేకరించారు. వారిలో ప్రముఖులు జస్దీప్ సింగ్ జస్సీ. మేరీల్యాండ్ ప్రజలు… ప్రజాస్వామ్యాన్ని గెలిపించడం కోసం ఏం చేయగలరో చేసి చూపించారని… కొనియాడారు అరుణ. విభజనకు వ్యతరేకంగా ఐక్యతకు ఓటేశారన్నారు. హక్కులను పరిమితం చేయడం కాకుండా… హక్కులను విస్తరించడాన్ని సమర్థించారన్నారు. భయంపై ఆశలు కలిగి ఉండటమే మేలని రుజువు చేశారన్నారు. మిల్లర్ తన తల్లిదండ్రులతో పాటు అమెరికాకు వలస వెళ్ళే ముందు ఆంధ్రప్రదేశ్‌లో జన్మించారు. 1972లో అమెరికా వచ్చినప్పటి నుండి, అమెరికా కోసం నిలబడ్డానన్నారు అరుణ. ప్రజలకు ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉన్నానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా ఎల్లప్పుడూ పోరాటాన్ని కొనసాగిస్తున్నానన్నారు.

