నేను చనిపోయానంటా… నాకు అంత్యక్రియలు చేయండి
పశ్చిమ బెంగాల్‌లో ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో చోటుచేసుకున్న ఒక విచిత్రమైన పొరపాటు తీవ్ర చర్చకు దారితీసింది. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ముసాయిదా జాబితాలో తన పేరును ‘మరణించిన వారి’ జాబితాలో చేర్చడంపై కోల్‌కతాకు చెందిన తృణమూల్ కాంగ్రెస్ కౌన్సిలర్ సూర్యదేవ్ వినూత్నంగా నిరసన తెలిపారు. బతికుండగానే తనను చనిపోయినట్లు రికార్డుల్లో చూపించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, నేరుగా శ్మశానవాటికకు వెళ్లి తనకు అంత్యక్రియలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. వివరాలన్నీ సక్రమంగా అందించినప్పటికీ, ఒక ప్రజాప్రతినిధి పేరునే ఇలా తొలగించడం వెనుక కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు. సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించిన ఆయన, ఈ తప్పిదానికి ప్రధాన ఎన్నికల కమిషనర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

