Breaking NewscrimeHome Page SliderTelangana

తెలంగాణ పోలీసుల‌కు హైకోర్టు మొట్టికాయ‌లు

సంచ‌ల‌నం సృష్టించిన ల‌గ‌చ‌ర్ల దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే ప‌ట్నం న‌రేంద్ర రెడ్డిపై పోలీసులు వివిధ స్టేష‌న్ల ప‌రిధిలో ఒక అంశానికి సంబంధించిన కేసుపై అనేక ఎఫ్ఐఆర్‌లు న‌మోదు చేయ‌డం ప‌ట్ల తెలంగాణ హైకోర్టు తీవ్ర‌ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.సుప్రీం కోర్టు నిబంధ‌న‌లు తెలియ‌వా? ఒకే అంశంపై అనేక ఎఫ్ఐఆర్‌లు పెట్ట‌కూడ‌ద‌ని తెలీదా? ఏ చట్టం ప్రకారం పట్నం నరేందర్ రెడ్డి మీద 3 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారో చెప్పండి.ఫిర్యాదులో ని అంశం ఒక‌టే అయిన‌ప్పుడు….ఫిర్యాది మారిన‌ప్పుడ‌ల్లా కొత్త ఎఫ్‌.ఐ.ఆర్‌.ఎలా నమోదు చేస్తారు.మీకు క‌నీసం స్పృహ ఉందా? అంటూ తెలంగాణ పోలీసుల‌కు హైకోర్టు మొట్టికాయ‌లు వేసింది. తహసీల్దార్, ఆర్డీవో, డీఎస్పీ, డీసీఆర్బీ.. ఇలా ఫిర్యాదు చేశారంటూ సంతకం మార్చారు గానీ… ఫిర్యాదు రాసిన రైటర్ సహా తేదీలు, నిందితుల పేర్లు మాత్రం ఒకేలా ఉన్నాయి. ఇది స‌మ‌ర్ధ‌నీయ‌మా చెప్పండి? అంటూ గ‌ద్గ‌ద స్వ‌రంతో మాట్లాడటంతో పోలీసులు మౌనం వ‌హించారు.