మళ్లీ రానున్న భారీవర్షాలు
రాష్ట్రంలో గతవారం కురిసిన కుంభవృష్టి కారణంగా రాష్ట్రంలోని నదులు, సరస్సులు పొంగి, పొరలి, ఉగ్రరూపం దాల్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ అల్పపీడనం ఒరిస్సా తీరంలో కేంద్రీకృతమై ఉంది. తెలంగాణాలో అల్లకల్లోలం సృష్టించిన ఈ అల్పపీడనం ఒరిస్సా నుండి బంగాళాఖాతం మీదుగా వెళ్లి, మళ్లీ భూమి పైకి వచ్చింది. దీనికి అనుబంధంగా ఉన్నగాలుల వలన ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు… వ్యాపించడంతో తెలంగాణాలో ఋతుపవనాలు చాలా చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాలలో భారీవర్షాలు నమోదు కావచ్చని వాతావరణశాఖ తెలియజేసింది. ఈ అల్పపీడనం కారణంగా అతి భారీవర్షాలతో పాటు… ఎగువన మహారాష్ట్ర నుండి వచ్చిన వరదల కారణంగా రాష్ట్రంలోని గోదావరి, కృష్ణా నదులు వాటి మీద గల ప్రాజెక్టులు కట్టలు దాటి ప్రవహించిన సంగతి మనకు తెలిసిందే. దీనివల్ల జనజీవనానికి చాలా ఇబ్బందులు వచ్చాయి.
Read more: దేశభవిత మనచేతుల్లోనే- ప్రధాని మోదీ