NewsTelangana

 మూడు రోజులపాటు తెలంగాణాలో ఎంసెట్ పరీక్షలు

Share with

తెలంగాణాలో నేటి నుండి ఎంసెట్ పరీక్షలు (ఇంజనీరింగ్ విభాగం) ప్రారంభమయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుండి దాదాపు 1,72,241 మంది విద్యార్దులు ఇంజినీరింగ్ విభాగంలో జరిగే ఈ పరీక్షలకు హాజరు కానున్నారు.దీని కోసం తెలంగాణాలో 89,ఏపీ లో 19 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. అయితే ఈ పరీక్షలు 18,19&20 వ తారీఖులలో కంప్యూటర్ బేస్డ్ విధానంలో జరగనున్నాయి.అధే విధంగా ఈ పరీక్షలు రెండు సెషన్స్‌లో జరగనున్నాయని అధికారులు తెలిపారు.మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు రెండో సెషన్ మధ్యహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్ష నిర్వాహణ అధికారులు ఒక్క నిమిషం ఆలస్యం అయిన విద్యార్దులను  పరీక్ష కేంద్రంలోకి అనుమతించమన్నారు. కాబట్టి విద్యార్దులు ఒక గంట ముందే పరీక్ష కేంద్రానికి రావాలని సూచించారు.

Read More: రాష్ట్రపతి ఎన్నిక షురూ ..