9 రోజులు సాగిన తెలంగాణ శాసన సభ సమావేశాలు, నిరవధిక వాయిదా
తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. తొమ్మిది రోజుల పాటు సాగిన శాసన సభ సమావేశాల్లో 32ప్రశ్నలకు మంత్రులు సమాధానాలిచ్చారు. 8 ప్రశ్నలకు సమాధానం రాలేదని స్పీకర్ చెప్పారు. ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు పంపిస్తామని మంత్రులు చెప్పారు. 23జులై నుంచి ఆగస్టు 2వరకు జరిగిన శాసన సభ జరిగింది. 65 గంటల 33 నిమిషాల పాటు సభ సాగింది. 132 ప్రసంగాలు సభలో ఎమ్మెల్యేలు చేసినట్లు స్పీకర్ ప్రకటించారు. గవర్నమెంట్ రెజల్యూషన్ 1, 5 బిల్లు ఆమోదం, 2 షాట్ డిస్కషన్, 3 మోషన్స్ పై చర్చ జరిగినట్లు ప్రకటించారు. శాసన సభలో ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్లు స్పీకర్ తెలిపారు.

