Home Page SliderTelangana

తిరుపతికి సీఎం రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 10 న సీఎం రేవంత్ రెడ్డి కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇదిలా ఉండగా.. వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతి ఏర్పాటు చేసిన టోకెన్ జారీ కేంద్రాల దగ్గర తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా 40 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తిరుమల వేంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ కౌంటర్ల వద్ద తొక్కిసలాట ఘటనలో పలువురు భక్తులు మరణించిన వార్త తీవ్రంగా కలచివేసిందని… వారి మృతికి సంతాపం తెలియజేస్తున్నానని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానంటూ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు.