ప్రారంభమైన తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణాలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ్యులంతా జాతీయ గీతాన్ని ఆలపించి ఈ సమావేశాలను మొదలుపెట్టారు. ఈ సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం,పరిపాటి జనార్థన్ రెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఈ సమావేశాల్లో తెలంగాణ పురపాలక చట్ట సవరణ సహా 6 బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఎటువంటి చర్చలు జరపకుండానే నేటి అసెంబ్లీ సమావేశం ముగిసింది. దీంతో ఈ సమావేశాలు ఈ నెల 12నకు వాయిదా పడ్డాయి. ఈ సమావేశాలు ప్రారంభమైన ఆరు నిమిషాలకే వాయిదా పడటం విశేషం. సమావేశాల నిర్వహణపై బీఎసీ సమావేశం జరగనుంది. గోదావరి వరద నష్టంపై మండలిలో స్వల్పకాలిక చర్చ జరిగింది.బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటే కేంద్రం అసలే సహాయం చేయలేదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు.

