తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30, ఫలితాలు డిసెంబర్ 3న వెలువడతాయి.అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 3న రిలీజ్ చేస్తారు. ఎన్నికల నోటిఫికేషన్ 3 నవంబర్ రిలీజ్ అవుతుంది. నామినేషన్లకు చివరి తేదీ నవంబర్ 10. నామినేషన్ల స్క్రుటినీ నవంబర్ 13 వరకు జరగనుంది. అభ్యర్థులు నవంబర్ 15 వరకు నామినేషన్లను విత్ డ్రా చేసుకోవచ్చు. డిసెంబర్ 5 నాటికి ఎన్నికల షెడ్యూల్ పూర్తవుతుంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి హోరాహోరీ జరగనున్నాయి. అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికలపై అంచనాలు పెరిగిపోయాయి. తెలంగాణ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 88 చోట్ల గెలుపొందగా, కాంగ్రెస్ 19, బీజేపీ ఒకచోట, మజ్లిస్ 7 స్థానాల్లోనూ గెలిచింది.టీడీపీ రెండు చోట్ల, స్వతంత్రులు ఒక చోట విజయం సాధించారు. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలున్నాయి.

