బీహార్ డిప్యూటీ సీఎంగా తేజస్వీ యాదవ్ ?
నిన్నటి దాకా బీజేపీ తో కలిసి సర్కార్ నడిపిన జేడీయూ నేత నితీష్ కుమార్ .. ఇప్పుడు ఆర్జేడీ, కాంగ్రెస్ పక్షాలతో కలిసి బీహార్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే గవర్నర్ ఫగూ చౌహాన్ ను కలిసి రాజీనామా సమర్పించిన నితీష్, తనకు మద్దతు ఇస్తున్న ఆర్జేడీ, ఇతర పార్టీల సంతకాలతో కూడిన లేఖలను కూడా గవర్నర్ కు సమర్పించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన పరిపూర్ణ మద్దతు తనకుందని నితీష్ గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్ళారు. త్వరలో ఏర్పాటు కాబోయే ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా నితీష్ కొనసాగితే ఉప ముఖ్యమంత్రి పదవి ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే స్పీకర్ పదవి కాంగ్రెస్ కు దక్కే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.అయితే ఎవరికి ఏ పదవి ఇవ్వాలి, ఏ పార్టీ నుండి ఎవరిని మంత్రి మండలిలోకి తీసుకోవాలి అన్న అంశాలు చర్చించేందుకు భాగస్వామ్య పార్టీలతో నితీష్ ఓ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు.