InternationalNews

టీమిండియా ఘోర ఓటమి.. ఫైనల్‌కు చేరుకున్న ఇంగ్లాండ్‌

టీ20 ప్రపంచకప్‌ సెమీ ఫైనల్‌లో భారత్‌ చిత్తుగా ఓడిపోయింది. అభిమానులకు తీవ్ర నిరాశ పరిచింది. వికెట్‌ పడకుండానే ఇంగ్లాండ్‌ ఘన విజయాన్ని సాధించింది. దీంతో ఇంగ్లాండ్‌ టీం ఫైనల్‌ల్లోకి అడుగు పెట్టింది. ఈనెల 13న జరిగే ఫైనల్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో ఇంగ్లాండ్‌ తలపడనుంది.

169 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ కేవలం 16 ఓవర్లలోనే పూర్తి చేసుకుంది. ఓపెనర్లు జోస్‌ బట్లర్‌ (80*), అలెక్స్‌ హేల్స్‌ (86*) ఓ ఆటను ఆడేసుకున్నారు. హేల్స్‌ 47 బంతుల్లో 86 పరుగులు (4 ఫోర్లు, 7 సిక్స్‌లు) చెలరేగి ఆడాడు.  ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ 49 బంతుల్లో 80 పరుగులు (9 ఫోర్లు, 3 సిక్స్‌లు) చేశాడు.

తొలుత భారత్‌ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. హార్దిక్‌ పాండ్యా 33 బంతుల్లో 63 పరుగులతో (5) సిక్స్‌లు, (4) ఫోర్లతో రెచ్చిపోయి ఆడాడు. జోర్డాన్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాదాడు పాండ్యా. 14 పరుగులు చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌… రషీద్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. హాఫ్‌ సెంచరీ చేసిన విరాట్‌ కోహ్లీ జోర్డాన్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. 50 పరుగులు చేసి నిష్ర్కమించాడు. రోహిత్‌ (27) పరుగులతో ఫర్వాలేదనిపించినా ధాటిగా ఆడలేకపోయాడు. కేఎల్‌ రాహుల్‌ (5), రిషబ్‌ పంత్‌ (6), సూర్యకుమార్‌ (14) పెద్దగా రాణించలేదు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో క్రిస్‌ జొర్డాన్‌ 3… క్రిస్‌ వోక్స్‌, అదిల్‌ రషీద్‌ చెరో వికెట్‌ తీశారు.