విద్యార్థులతో టిక్‌టాక్ స్టెప్పులేసిన పంతులమ్మ-ఉద్యోగం గోవిందా
ఈమధ్యకాలంలో ప్రతీ విషయానికి డ్యాన్సులు చేయడం మామూలైపోయింది. పెళ్లికూతుర్ల నుండి టీచరమ్మల వరకూ తీన్‌మార్ స్టెప్పులేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నారు. అయితే టీచర్ డ్యాన్సులు మాత్రం అసభ్యంగా ఉండకూడదు. బ్రెజిల్‌కు చెందిన సిబెల్లీ ఫెరీరా అనే టిక్‌టాక్ స్టార్ టీచర్ తరగతి గదిలోనే విద్యార్థులతో కలిసి అసభ్యంగా డ్యాన్సులు చేస్తూ టిక్‌టాక్‌లో షేర్ చేసింది. దీనిని చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. భావి పౌరుల్ని తీర్చి దిద్దవలసిన వృత్తిలో ఉండి ఇదేం పని అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఆమెను స్కూల్ యాజమాన్యం ఉద్యోగం నుండి తొలగించింది. సోషల్ నెట్‌వర్క్‌లను, టెక్నాలజీని వాడుకుంటూ విద్యాబోధన చేస్తే విద్యార్థులకు బాగుంటుందంటూ ఆమె జవాబిస్తోంది. కానీ ఏదైనా మితిమీరితే అది విషమే. పరిమితిలో ఉంటూ టెక్నాలజీని వాడుకుంటే బాగుండేదని కొందరు సలహా ఇస్తున్నారు. అయితే ఆమెకు టిక్‌టాక్‌లో 9.8 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉండగా, ఇన్‌స్టాగ్రామ్‌లో 1.2 మిలియన్ల మంది ఉన్నారట. ఈమె బ్రెజిల్ ఫెడరల్ యూనివర్సిటీ ఆఫ్ లావ్‌రాస్ నుండి జీవశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిందట. ఓ స్కూల్‌లో ఇంగ్లీష్ టీచర్‌గా పని చేస్తోంది. అయితే ఆమె అత్యుత్సాహం వల్ల ఆ ఉద్యోగం ఊడింది. అయితే కొందరు నెటిజన్లు ఆమెకు మద్దతు ఇవ్వడం కూడా విశేషం.

