NewsTelangana

నదిలో పడిపోయిన టీడీపీ నేతలు… చంద్రబాబు పర్యటనలో…

Share with
Chandrababu fell in river

టీడీపీ నేతలకు పెను ప్రమాదం తప్పింది. పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటనలో పడవ ప్రమాదం జరిగింది. రెండు పడవలు ఢీకొని గోదావరిలో పడిపోయాయ్. టీడీపీ నేతలు గోదావరిలో పడిపోయారు. మాజీ మంత్రులు దేవినేని ఉమ, ఉండి ఎమ్మెల్యే రామరాజు, తణుకు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ, సత్యనారాయణ పడిపోగా… మత్స్యకారులు టీడీపీ నేతలను కాపాడారు. లైఫ్ జాకెట్లను ఉపయోగించి టీడీపీ నేతలను బయటకు తీశారు. మరపడవలో చంద్రబాబు వెళ్తుండగా… ఆయనతో మరో పడవలో టీడీపీ నేతలు వెళ్తుండగా… పంటు చివరకి రావడంతో… అదుపుతప్పి మరో బోటను ఢీకొంది. చంద్రబాబు పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో అపశృతి చోటుచేసుకొంది. సోంపల్లి సమీపంలో బోటు పైనుంచి నేతలు కిందపడ్డారు. మత్స్యకారులు సమయోచితంగా స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. టీడీపీ నేతలు ఊపిరిపీల్చుకున్నారు.