ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్
అనుమర్లపూడిలో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయంటూ… టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తలపెట్టిన చలో అనుమర్లపూడి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసు ఆంక్షలు అడ్డుకొని ధూళిపాళ్ల అనుమర్లపూడి చేరుకోవడంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అనుమతి లేకుండా గ్రామంలోకి రావడంతో ధూళిపాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధూళిపాళ్లను అరెస్టు చేసి తెనాలికి తరలించారు. మరోవైపు నరేంద్ర అరెస్టుపై భగ్గుమన్నారు టీడీపీ నేత లోకేశ్.
వైసీపీ పాలన చేపట్టాక… రాష్ట్రాన్ని దోపిడి చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ ప్రజలను చీట్ చేస్తున్నాడంటూ విమర్శించారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీ నేతలు చెలరేగిపోతున్నారని… మట్టి, గ్రావెల్ మాఫియా రాజ్యమేలుతున్నాయన్నారు లోకేశ్. దోపిడీని ప్రశ్నించిన ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేయడం అరాచకపాలనకు పరాకాష్ట అన్నారు. నరేంద్రకు పార్టీ పూర్తి మద్దతుగా నిలుస్తుందన్నారు.