Andhra PradeshNews

నిన్న బాలినేని… ఇవాళ కోటంరెడ్డి

Share with

వైసీపీలో సీన్ చేంజ్ అయిపోతోంది… సిచ్యువేషన్ రోజు రోజుకు మారిపోతోంది. 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీలో ఇప్పుడు రోజుకో ఇష్యూ బయటపడుతున్నాయ్. కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ తర్వాత కొత్త ఇష్యూలు బయటకొస్తున్నాయ్. టీడీపీతో కలిసి వైసీపీలోని ఓ పెద్ద నేత తనపై కుట్ర చేశాడంటూ మాజీ మంత్రి బాలినేని విమర్శలతో వేడెక్కిన రాజకీయాలను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరింత హాట్ హాట్ గా మార్చేశారు. బాలినేని తరహాలోనే తనకూ ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. జిల్లా ముఖ్యనేతలు వాళ్ల నియోజకవర్గాల్లో తన ఏరియాలో జోక్యం చేసుకుంటున్నారని కోటంరెడ్డి ఆరోపించారు.

బాలినేని మూడు జిల్లాలకు ఇన్‌ఛార్జిగా ఉన్నారని… అలాంటి వ్యక్తికి స్థానిక నాయకులు అండగా ఉండాలి కానీ… సమస్యగా మారకూడదన్నారు కోటంరెడ్డి. బాలినేని ఆవేదన బాధ కలిగించిందన్నారు. బాలినేని ఆవేదనకు గురయ్యేలా ఎవరూ ప్రవర్తించరాదన్నారు. నెల్లూరులో సేమ్ టు సేమ్ సమస్య తనకూ ఉందన్నారు. కొందరు నేతలు వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలో ఆలోచించకుండా… పక్కనోళ్లకు సమస్యలు సృష్టిస్తున్నారన్నారు కోటంరెడ్డి. ఇలాంటి పరిస్థితి వచ్చే రోజుల్లో పార్టీకి నష్టం కలిగిస్తుందన్నారు. టీడీపీతో కలిసి ఓ పెద్ద నేత… తనను, తన కుమారుడిని బద్నాం చేస్తున్నారంటూ విమర్శించారు.