NationalNews

అగ్నివీరుల దరఖాస్తులకు ఆహ్వానం

Share with

అగ్ని వీరుల నియామకాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేసింది. జులై నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని ఆర్మీ తెలిపింది. అగ్నివీరుల్లోని విభాగాలు… అందుకు కావాల్సిన అర్హతల వివరాలను నోటిఫికేషన్‌లో వెల్లడించింది. అగ్నివీరులకు ఇచ్చే ప్యాకేజీ వివరాలను ఆర్మీ పేర్కొంది. ఏ విభాగంలో ఎంతెంత శాలరీ వస్తుంది… సెలవులు, సర్వీసు నిబంధనల వివరాలను వెల్లడించింది. అగ్నిపథ్ పై గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నా… ఆర్మీ మాత్రం తన పని తాను చేసుకుపోతోంది.ప్రస్తుతం ఆర్మీలో చేరేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇండియన్ నావీ, వాయుసేనలకు సంబంధించి నోటిఫికేషన్లను త్వరలోనే విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అగ్నివీరులకు కేంద్ర బలగాల్లో పది శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఇప్పటికే హోం శాఖ ప్రకటించింది. మరోవైపు కార్పొరేట్ వరల్డ్ సైతం అగ్నివీరులను కంపెనీల్లోకి తీసుకుంటామంటూ భరోసా ఇస్తున్నాయ్.