Andhra PradeshHome Page Slider

APSRTC ఛైర్మన్‌గా టీడీపీ లీడర్

APSRTC ఛైర్మన్‌గా టీడీపీ లీడర్ కొనకళ్ల నారాయణను ఎన్నిక చేశారు. ఈయన గతంలో రెండుసార్లు మచిలీపట్నం ఎంపీగా పనిచేశారు. అయితే గత ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి కారణంగా మచిలీపట్నం ఎంపీ సీటు జనసేనకు కేటాయించారు. దీనితో ఆయనకు మంచి పదవి ఇస్తామని అప్పట్లో బుజ్జగించారు. ఇప్పుడు APSRTC ఛైర్మన్‌గా నియమించడంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రులు కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, ఇతర నేతలు ఆయనను అభినందించారు.