చిలకలూరిపేటలో ఈ నెల 17న టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన
ఈ నెల 17న చిలకలూరిపేటలో తెలుగుదేశం – జనసేన ఉమ్మడి భారీ బహిరంగ సభలో మేనిఫెస్టో ప్రకటన ఉంటుందన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. చిలకలూరిపేట బహిరంగ సభ ద్వారా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. చిలకలూరిపేట సభకు బస్సులు కేటాయించాలని ఆర్టీసీ ఎండీని డిమాండ్ చేస్తున్నామన్నారు అచ్చెన్నాయుడు. సభకు బస్సులు కేటాయించకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

టీడీపీ-జనసేన అభ్యర్థుల జాబితా చూసి.. వైసీపీ వణికిపోతుందన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కె అచ్చెన్నాయుడు. వైసీపీ నేతల వేధింపుల నుంచి పార్టీ శ్రేణులను కాపాడేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 73062-99999 నెంబర్ ను ఏర్పాట్లు చేశామన్నారు. చిలకలూరిపేట సభ రాష్ట్ర చరిత్రలో సంచలనంగా నిలుస్తోందన్నారు. సమావేశం ద్వారా రాష్ట్ర ప్రజలకు రెండు పార్టీలు దిశానిర్దేశం చేస్తాయన్నారు. ప్రతిపక్షాలపై పోలీసులు కక్షసాధింపు మానుకోవాలన్నారు.

