Andhra PradeshHome Page Slider

ఏపీని కాపాడుకోవటానికే టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు – కనకమేడల రవీంద్ర కుమార్

చంద్రబాబు, పవన్ కల్యాణ్… హోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డాతో సమావేశం తర్వాత పొత్తు కన్ఫామైందన్నారు రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్. భేటీలో మూడు పార్టీలు కలిసి పొత్తుతో వెళ్లాలని నిర్ణయమైందన్నారు. పొత్తుకు సంబంధించి, మూడు పార్టీలు కలిపి జాయింట్ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తాయన్నారు. ఎన్నికల్లో ఎలాంటి గందరగోళం లేకుండా పనిచేస్తాయన్నారు. సీట్ల విషయంలో ఒక అవగాహనకు రావాల్సి ఉందని చెప్పారు. ఎన్డీఏలో చేరడం, పొత్తుతో ఎన్నికల్లో పోటీ చేయడం, ముగ్గురూ కలిసి పోటీ చేసే విషయంలో ఇక సందిగ్ధతకు తావులేదన్నారు. రాష్ట్ర భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని, కొంత మందికి ఇబ్బంది వచ్చినా రాష్ట్ర అవసరాల కోసం పొత్తు పెట్టుకుంటున్నామని ఎంపీ కనకమేడల చెప్పారు. చంద్రబాబు కన్విన్స్ చేయకముందే, పొత్తు అవసరమన్న భావన నేతల్లో ఉందన్నారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా, ప్రభుత్వ ఓటు చీలకుండా మూడు పార్టీలు కలిసి పనిచేయాలని చంద్రబాబు చెప్పారన్నారు కనకమేడల రవీంద్రకుమార్.

పొత్తు లెక్కలపై పార్టీల్లో విభేదాల్లేవని, తాత్కాలికంగా కొందరు నేతల్లో అసంతృప్తి మాత్రమే ఉంటుందన్నారు. అలాంటి వారికి పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అవకాశాలు కల్పిస్తామన్నారు. పార్టీలో మెజార్టీ కేడర్‌కు అన్యాయం జరగక్కుండా గెలుపు ప్రాతిపదికన సీట్ల షేరింగ్ ఉంటుందని చెప్పారు. అధికారం కోసమైతే పొత్తు పెట్టుకునేవాళ్లం కాదన్న కనకమేడల, ప్రజల ప్రయోజనాలే టీడీపీకి ముఖ్యమన్నారు. రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి పాలన నుంచి విముక్తి చేయడం తమ లక్ష్యమన్నారు. ప్రజలందరూ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చరాదని, రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే భావిస్తున్నారని అందుకే తాము పొత్తులు పెట్టుకున్నామన్నారు.

2019-24 వరకు వైసీపీ వ్యక్తిగత స్వలాభం కోసం పనిచేసిందన్నారు. కేసుల కోసం తానే మెడలు వంచి ఏమీ అడగలేని స్థితికి జగన్ నెట్టబడ్డారని ఆయన చెప్పారు. టీడీపీ-బీజేపీ పొత్తుల గురించి వైసీపీ కామెంట్స్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రాక్టికల్‌గా ఇన్నాళ్లూ, బీజేపీకి వైసీపీ సహకరించిందని… కేంద్ర నిధులిచ్చినా, రాష్ట్ర వాటా రిలీజ్ చేయలేదని … అందుకే అభివృద్ధి లేకుండాపోయిందన్నారు. మూడు పార్టీల పొత్తుల గురించి వైసీపీ ఉలిక్కిపడుతుందన్నారు. అందుకే వైసీపీ నేతలు చంద్రబాబు జపం చేస్తున్నారని దుయ్యబట్టారు. 20 ఏళ్ల క్రితం చంద్రబాబు అవినీతి చేశారని… ఆరోపణలు చేస్తున్నారని మీడియాలో విమర్శిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. చంద్రబాబుపై ఇప్పటి వరకు 26 యంక్వైరీ కమిషన్లు వేశారని… వాటి వల్ల ఏమీ రుజువు కాలేదన్నారు కనకమేడల రవీంద్రకుమార్. చంద్రబాబుపై అక్రమ కేసులు తప్ప ఏ కేసులు లేవన్నారు.

అభూతకల్పనలతో దుష్ప్రచారం చేస్తున్నారని… గతంలో వైఎస్సార్, ఇప్పుడు జగన్ వేసినా ఏ కేసులు కూడా రుజువు కాలేదన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసులు తప్ప, కేసులే లేవని తేల్చి చెప్పారు. కూటమి ఆమోదం తర్వాత ప్రణాళిక రిలీజ్ చేస్తామన్నారు. అన్ని విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. జగన్ పాలనలో ఏపీ ఎలా నష్టపోయింది, 30 ఏళ్ల ఎలా నష్టపోయిందన్నది ప్రజలు గమనించారని… ప్రజలకు అన్ని విషయాలు చెప్తామన్నారు. 2024 ఎన్నికల్లో కూటమి విజయం ఖాయమన్న కనకమేడల, బీజేపీ ఆ డిమాండ్లు పెట్టింది.. ఈ డిమాండ్లు చేస్తోందన్నది కరెక్ట్ కాదని… బీజేపీ భారీ డిమాండ్లు పెట్టిందన్నది ఊహాజనితమన్నారు. కూటమి చాలా స్పష్టతతో ముందుకెళ్తుందని చెప్పారు.