BusinessHome Page SliderNationalNews Alert

రూ.12 వేల కోట్ల త్రైమాసిక లాభంతో టాప్‌లో టీసీఎస్

టాటా గ్రూప్‌కు చెందిన టీసీఎస్ కంపెనీ ఈ త్రైమాసికంలో రూ.12,380 కోట్ల నికరలాభాన్ని ఆర్జించినట్లు ప్రకటించి టాప్‌ లెవెల్లో దూసుకుపోయింది. 2024 డిసెంబర్ నాటి లాభాన్ని ప్రకటించింది. ఈ త్రైమాసికంలో 12 శాతం వృద్ధిని సాధించినట్లు పేర్కొంది. ఒక్కో షేరుకు రూ. 10 మధ్యంతర డివిడెండ్‌తో పాటు, రూ.66 చొప్పున స్పెషల్ డివిడెండ్ చెల్లిస్తామని కంపెనీ వెల్లడించింది. సీజనల్ సవాళ్లు ఎదుర్కొన్నా కూడా మెరుగైన కాంట్రాక్టులు సాధించినట్లు తెలిపింది. వివిధ రంగాలు, ప్రాంతాలు, దేశాల నుండి ఆర్డర్లు, ప్రాజెక్టులు వచ్చాయని కంపెనీ సీఈఓ కృతి వాసన్ పేర్కొన్నారు. అలాగే వచ్చే ఏడాది పెద్ద సంఖ్యలో క్యాంపస్ నియామకాలు తీసుకుంటామని తెలిపారు. ఇటీవల బెంగళూరులో రూ.1625 కోట్ల విలువైన భూమిని కంపెనీ కోసం కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు