ట్రంప్‌పై టార్గెట్ ప్లాన్..? సన్‌బాత్ సమయంలో దాడి చేస్తామన్న ఇరాన్..
టెహ్రాన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను టార్గెట్ చేస్తూ ఇరాన్ తీరుపై తీవ్ర చర్చ మొదలైంది. ట్రంప్ ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో రిసార్ట్ సురక్షితం కాదని, అతను సన్‌బాత్ చేస్తున్న సమయంలో డ్రోన్ దాడికి గురయ్యే అవకాశం ఉందని ఇరాన్ అధికార ప్రతినిధి జావద్ లారిజానీ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ సలహాదారుడైన లారిజానీ ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, “అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై డ్రోన్‌తో దాడి చేయడం చాలా సులభం. ఆయన ఇక తన నివాసంలో సైతం సురక్షితంగా ఉండలేరు,” అని అన్నారు. ఈ వ్యాఖ్యలు 2020లో అమెరికా సైన్యం హతమార్చిన ఇరాన్ జనరల్ ఖాసిం సులేమానీ కేసుని గుర్తు చేస్తూ వెలువడినట్లు తెలిపారు.ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలు, అమెరికా అణు కేంద్రాలపై దాడులతో మౌలికంగా ఏర్పడిన ఉద్రిక్త వాతావరణంలో ఈ వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి. అమెరికా తమ చర్యలకు మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఇరాన్ తరచూ హెచ్చరిస్తూ వస్తోంది. ట్రంప్ స్పందన ఇరాన్ వ్యాఖ్యలపై ట్రంప్ స్పందిస్తూ, “అది నిజమైన ముప్పే కావచ్చు. అయినా నాకు ఇది నిజమో కాదో తెలియదు,” అని చెప్పారు. విలేకరి “మీరు చివరిసారిగా ఎప్పుడు సన్‌బాత్‌కి వెళ్లారు?” అని అడిగిన ప్రశ్నకు ట్రంప్ నవ్వుతూ ‘నాకు ఏడేళ్ల వయసులో’ అని సరదాగా సమాధానం ఇచ్చారు. “నాకెప్పుడూ సన్‌బాత్ అంటే ఇష్టం ఉండదు” అని హాస్యంగా జవాబిచ్చారు. ఈ సమాధానం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. బ్లడ్ పాక్ట్క్రౌడ్ఫండింగ్ ట్రంప్‌పై బౌంటీ? ఇక మరోవైపు, “బ్లడ్ పాక్ట్” అనే పేరుతో ఓ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ట్రంప్‌పై బౌంటీ ప్రకటించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ క్రౌడ్ ఫండింగ్‌కి జులై 8 నాటికి సుమారు 27 మిలియన్ డాలర్ల మేర నిధులు సేకరించబడ్డాయని తెలుస్తోంది. ఇది ఇరాన్ పక్షాన ట్రంప్, ఇతర అమెరికా నాయకులపై ప్రతీకార చర్యలకే ఉపయోగించనున్నట్లు అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు.ఈ తాజా పరిణామాల నేపథ్యంలో ఇరాన్,అమెరికా సంబంధాలు మరింత ఉద్రిక్తతకు లోనవుతున్నాయి. ట్రంప్ మీద చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర స్పందనకు కారణమవుతుండగా, అమెరికా భద్రతా సంస్థలు ఈ మాటల్ని సీరియస్‌గా తీసుకోవడం ప్రారంభించాయి.

