గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు తమిళిసై ఆమోదం
గవర్నర్ కోటా కింద ఇద్దరు ఎమ్మెల్సీలకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీ ఖాన్‌ల ఎంపికను గవర్నర్ తమిళసై సమర్థించారు. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో గవర్నర్ ఎమ్మెల్సీలపై తమిళిసై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తొలుత పాడి కౌశిక్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించిన గవర్నర్, ఆ తర్వాత దాసోజు శ్రావణ్ అభ్యర్థిత్వాని నిరాకరించారు.

