వేద బ్రాహ్మణుడిపై కత్తుల వేట
విజయవాడలో సత్యనారాయణపురం పేరు చెబితే గుర్తొచ్చేది అక్కడ అత్యధికంగా నివాసముండే బ్రాహ్మణులు. గొడవలకు, రాజకీయాలకు దూరంగా ఉండే అటువంటి వారి ఆస్తి వైసీపి నేత గౌతంరెడ్డి కన్నేశాడు.గండూరి ఉమామహేశ్వరశాస్త్రి తల్లి పేరిట లక్ష్మీనగర్‌లో 325 చదరపు అడుగుల స్థలం ఉంది. సుమారు 5 కోట్ల విలువైన ఈ ఆస్తిని ఫైబర్‌నెట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, వైఎస్సార్సీపీ నేత గౌతంరెడ్డి తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమించడమే కాకుండా అధికార బలంతో నిర్మాణాలు కూడా చేపట్టాడు. దీనిపై న్యాయపోరాటం, శాంతియుత దీక్షలు చేస్తున్న ఉమామహేశ్వరశాస్త్రిని అంతం చేయడానికి గౌతం రెడ్డి కిరాయి హంతకులకు 24 లక్షలకు సుపారీ ఇచ్చాడు. దీంతో హంతకులు ఉమామహేశ్వర శాస్త్రి పై హత్యాయత్నం చేసారు. గౌతంరెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేయడంతో పరారయ్యాడు.


 
							 
							