NationalNews Alert

సూర్య 42 మోషన్ పోస్టర్

సూర్య 42వ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. యూవీ క్రియేషన్స్ , స్టూడియో గ్రీన్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. దీనిలో సూర్య యుద్ధ వీరుడిగా కనిపిస్తాడు. ఆయన లుక్ , కాస్ట్యూమ్స్  చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. అయితే దీనిలో ఒక భుజంపై అమ్ములపొది , మరో భుజం పై డేగ , చేతిలో గండ్రగొడ్డలి పట్టుకొని ఆయన కనిపిస్తారు. ఫేస్‌ని చూపించకుండా కాస్ట్యూమ్‌ మాత్రం చూపిస్తూ వెనక్కి తిరిగి ఉన్న సూర్య లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇప్పటి వరకు సూర్య నటించిన సినిమాల కంటే ఇది చాలా భిన్నంగా ఉందని తెలుస్తోంది.