crimeHome Page SliderNational

భారత్‌లోని విదేశీ నేరగాళ్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

భారత్‌లో నేరారోపణలు ఎదుర్కొంటున్న విదేశీయులను భారత్ నుండి వెళ్లేందుకు అనుమతినివ్వలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గతేడాది బెయిల్‌ మంజూరు చేసిన నైజీరియా దేశస్థుడి విషయంలో ఈ కామెంట్లు చేసింది. మాదక ద్రవ్యాల కేసులో అరెస్టయిన నేరస్థుడు బెయిల్‌పై ఉన్నప్పటికీ దేశాన్ని విడిచి వెళ్లరాదని, ఏదైనా కేసులో విదేశీయుడిని తప్పనిసరిగా ప్రశ్నించాల్సి ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితులలో దేశం విడిచి వెళ్లరాదని పేర్కొంది. ఈ ఉత్తర్వులను తక్షణమే విదేశీయుల నమోదు కార్యాలయ అధికారులకు తెలియజేయాలని ప్రభుత్వాలకు, దర్యాప్తు సంస్థలకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది