జమ్మూ కశ్మీర్ నియోజకవర్గాల పునర్విభజనపై అప్పీల్‌ను తిరిస్కరించిన సుప్రీంకోర్టు
జమ్మూ కాశ్మీర్ నియోజకవర్గాల మార్పు, చేర్పులకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కేంద్రం చేసిన కసరత్తు బీజేపీకి అనుకూలంగా ఉందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. 2019లో జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు, చేసిన తర్వాత రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయిన తర్వాత జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన కోసం ఏర్పాటు చేసిన డీలిమిటేషన్ కమిషన్‌ను, పిటిషన్ దారులు సవాలు చేశారు. శ్రీనగర్‌కు చెందిన హాజీ అబ్దుల్ గనీ ఖాన్, ముహమ్మద్ అయూబ్ మట్టో, 2026 కంటే ముందు తీసుకునే నిర్ణయాలపై నిషేధం ఉందని, నియోజకవర్గాల మార్పు జరపరాదని రాజ్యాంగంలో స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. డీలిమిటేషన్ ప్యానెల్ గతేడాది మేలో కసరత్తు పూర్తి చేసింది. జమ్మూ కశ్మీర్‌లోని తొంభై అసెంబ్లీ, ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాలను, J&K పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పునర్విభజించారు.

