సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్
తమిళ సూపర్‌స్టార్ అజిత్ అంటే ఒకప్పుడు క్రేజీ హీరో. బైక్, కార్ రేసర్‌గా దూసుకుపోతున్న అజిత్ సినిమాల నుండి రిటైర్ అయిపోతానని ఫ్యాన్స్‌కు ఇటీవల సిగ్నల్స్ ఇస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్యూలో మాట్లాడుతూ ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. నాకు ఇష్టం లేకపోయినా సినిమాలకు దూరం కావచ్చు. నేడు నిద్రపోయి రేపు నిద్ర లేచామంటే అదృష్టమే, మిగిలిన ఈ జీవితాన్ని ప్రతీక్షణం ఆస్వాదించాలనుకుంటున్నాను అంటూ మాట్లాడారు. దీనితో ఆయన సినిమాల నుండి రిటైర్ కావచ్చని అనుకుంటున్నారు. మరో సూపర్ స్టార్ విజయ్ కూడా రాజకీయాలలో చేరి, సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

