దుమ్మురేపిన సన్ రైజర్స్ హైదరాబాద్, ఐపీఎల్ చరిత్రలో హయ్యస్ట్ స్కోర్
ట్రావిస్ హెడ్ (24 బంతుల్లో 62), అభిషేక్ శర్మ (23 బంతుల్లో 63), హెన్రిచ్ క్లాసెన్ (34 బంతుల్లో 80) అర్ధశతకాలు బాదడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసింది. హైదరాబాద్ ఉప్పల్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో SRH 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. హెడ్ ఒక చివర నిలిచి SRHకి అద్భుతమైన ప్రారంభాన్ని అందించాడు. హార్దిక్ పాండ్యా మయాంక్ అగర్వాల్ వికెట్ పగగొట్టకముందు, అభిషేక్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు హెడ్ ప్రదర్శనతో SRHకి అద్భుతమైన ప్రారంభాన్ని అందించాడు. క్లాసెన్, ఐడెన్ మార్క్రామ్ తర్వాత ఛార్జ్ తీసుకోవడంతో హైదరాబాద్ సూపర్ సక్సెస్ అయ్యింది. అంతకుముందు, ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ముంబై ఇండియన్స్‌కు ఇది రోహిత్ శర్మకు 200వ ఐపిఎల్ గేమ్.

