స్పేస్‌లో క్రిస్మస్ సంబరాలు
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో వ్యోమగాములు కూడా క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ నాసా వీడియో విడుదల చేసింది. సునీతా విలియమ్స్‌తో పాటు ఇతర వ్యోమగాములు తలపై శాంతాక్లజ్ టోపీ పెట్టుకుని, భూమిపై ఉన్నవారికి శుభాకాంక్షలు తెలుపుతూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ఏడాది జూన్ 6న బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సుల్‌లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీతా విలియమ్స్ కొన్ని సాంకేతిక కారణాల వల్ల తిరిగి రావడం ఆలస్యం అవుతోంది. వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకు తిరిగి వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

