అలాంటి శారీరక సంబంధం తప్పుకాదు – సుప్రీం తీర్పు
ఇద్దరి పరస్పర అంగీకారంతో ఏర్పడే శారీరక సంబంధాలు నేరం కావని సుప్రీం కోర్టు గురువారం మరో సారి స్పష్టం చేసింది.ఇలాంటి వ్యవహారాల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ కేసులు నమోదు చేయొద్దని పోలీసులకు సూచించింది. ప్రేమ లేదా ఇతర సంబంధాల్లో ఇద్దరు వ్యక్తులు పరస్పరం అంగీకారంతో లైంగిక సంబంధం పెట్టుకుంటే దాన్ని వ్యతిరేకించడానికి మీరెవరంటూ స్పందించింది.ఇటీవల కాలంలో ఇలాంటి కేసులు దేశ వ్యాప్తంగా నమోదౌతున్న తరుణంలో సుప్రీం ఇచ్చిన తీర్పు సహజీవన ప్రేమికులకు,వివాహేతర సంబంధ అభిలాషకులకు పెద్ద ఊరటనిచ్చిందనే భావించాలి. ప్రధానంగా పొలిటీషియన్స్‌కి,సినీ తారలకు ఇది పెద్ద హ్యపీ న్యూసని చెప్పక తప్పదు. భార్య భర్తలు ఇక నుంచి ఎన్ని స్టెపినీలైనా మార్చుకోవచ్చు… అంగీకారమైతే ఎన్ని కుంపట్లైనా పెట్టుకోవచ్చు.

