InternationalNews

శుభమన్ గిల్ కెరీర్‌లో తొలి శతకం

నేటితో మూడోవన్డేలో భారత్ ఇన్నింగ్స్ ముగిశాయి. ఈ ఇన్నింగ్స్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 289/8 స్కోరు సాధించింది. అయితే ఈ ఇన్నింగ్స్‌లో శుభమన్ గిల్ సత్తా చాటారు. తన కెరీర్‌లోనే మొట్టమొదటి సారిగా ఆయన (130) శతకాన్ని నమోదు చేసుకున్నారు.

 గిల్‌కు తోడుగా ఇషాన్ కిషన్ అర్ధశతకం (50)  సాధించారు. దీంతో జింబాబ్వే ఎదుట భారీ లక్ష్యం నిర్దేశించడంలో ఇషాన్ కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 289 పరుగులు చేసింది. ఈ మేరకు జింబాబ్వే గెలవటానికి 290 పరుగులను భారత్ నిర్దేశించింది. శిఖర్ ధావన్(40),కేఎల్ రాహుల్ (30) పరుగులతో కాస్త పర్వాలేదనిపించారు.