రికార్డ్ సృష్టించిన టీమిండియా స్టార్ క్రికెటర్
టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ రికార్డ్ సృష్టించారు.కాగా సెప్టెంబర్ నెలకు గాను ICC తాజాగా అవార్డులు ప్రకటించింది. వీటిలో ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును శుభ్‌మన్ గిల్ గెలుచుకున్నారు. దీంతో రెండు సార్లు ఈ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్న తొలి భారత క్రికెటర్‌గా గిల్ రికార్డు నెలకొల్పాడు.కాగా గిల్ సెప్టెంబర్‌లో జరిగిన వన్డేల్లో 480 పరుగులు చేసి ఆసియా టాప్ స్కోరర్‌గా నిలిచారు. అయితే ఇటీవల గిల్ డెంగ్యూ బారిన పడ్డారు. దీంతో ఆయన ODI వరల్డ్ కప్‌లో తొలి 2 మ్యాచ్‌లకు దూరమయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన డెంగ్యూ నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేపు దాయాదుల పోరు ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ ఆడే అవకాశాలు కన్పిస్తున్నాయి.