పీఈటీ కొట్టడంతో విద్యార్థి సూసైడ్..
ఓ పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి 8వ తరగతి విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బోడుప్పల్ ద్వారక నగర్ కు చెందిన ధర్మారెడ్డి, సంగీత దంపతుల రెండవ కుమారుడు సంగారెడ్డి ఉప్పల్ న్యూ భారత్ నగర్ లోని సాగర్ గ్రామర్ స్కూల్లో చదువుతున్నాడు. ఇవాళ ఉదయం క్లాస్ రూంలో పీఈటీ ఆంజనేయులు విద్యార్థిని మందలించి కొట్టడంతో మనస్తాపానికి గురయ్యాడు. వాష్ రూంకి వెళ్లి వస్తానని చెప్పి నాలుగు అంతస్తుల బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మృతుడి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

