కూంబింగ్ ఆపండి..చర్చలకు సిద్ధం..
కేంద్ర ప్రభుత్వానికి మావోయిస్టులు కీలక విజ్ఞప్తి చేశారు. వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న కూంబింగ్ ఆపరేషన్లు ఆపాలని, తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖను విడుదల చేశారు. ఒడిశా, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, ఝార్ఘండ్, తెలంగాణ రాష్ట్రాలలో తమపై దాడులు చేయవద్దని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు సహకరించాలని కోరుకున్నారు. ఇటీవల కేంద్రం చేపట్టిన కూంబింగ్ ఆపరేషన్లలో పలువురు మావోయిస్టులు మృతి చెందడంతో ఆందోళన చెందుతున్నారు.

