Breaking NewsHome Page SliderNationaltelangana,

రికార్డు స్థాయిలో ప‌త‌న‌మైన స్టాక్ మార్కెట్లు

స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి.ఒక్క రోజులో…అందునా కేవ‌లం 6 గంట‌ల వ్య‌వ‌ధిలో 10 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైంది. సెన్సెక్స్ 1,018 పాయింట్ల నష్టంతో 76,293 దగ్గర ముగియ‌గా….309 పాయింట్ల నష్టంతో 23,071 దగ్గర నిఫ్టీ ముగిసింది. ప్రతీకార సుంకాలు విధిస్తామని యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్‌ వ్యాఖ్యలు చేయ‌డంతో ఇండియ‌న్ మార్కెట్లు నిలువునా కుప్ప‌కూలాయి.ట్రంప్ అధ్య‌క్షునిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించాక భార‌తీయ స్టాక్ మార్కెట్లు ప‌త‌న‌మ‌వ‌డం ఇది ఐదోసారి.