షర్మిల పార్టీలోకి హైదరాబాద్ కాంగ్రెస్ ముఖ్యనేత
కాంగ్రెస్ పార్టీ అంటే తెలియని వారుండరు. దీనిని స్ధాపించి ఇప్పటికే ఎన్నో ఏళ్లు అవుతున్న విషయం తెలిసిందే. 136 వసంతాలలో ఎన్నో మార్పులు , చేర్పులు జరిగాయి. ఇంత పెద్ద పార్టీలో ఎంతోమంది నేతలు , కార్యకర్తలు , ఎమ్మేల్యేలు ఇంకా ఎందరో నిరంతరం శ్రమిస్తూ పార్టీని ముందుకు నడిపిస్తుంటారు. ఈ క్రమంలో పార్టీ సభ్యులు ఎన్నో ఇబ్బందులు , విమర్మలు , ఇతర పార్టీ నేతల వ్యతిరేకతలను ఎదుర్కొంటారు. కొన్ని సందర్భల్లో సొంత పార్టీ లోనే ఒకరితో ఒకరికి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయ్. దీంతో కొంతమంది పార్టీ ఫిరాయిస్తూ ఉంటారు. తాజాగా కాంగ్రెస్‌లో ఇటువంటి వ్యవహారాలు బయటకు వచ్చాయి. కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన రామా గౌడ్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ ఎంతో గొప్ప చరిత్ర ఉన్న పార్టీ , కానీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం పార్టీని ఒకే వర్గానికి పరిమితం చేస్తున్నారన్నారు. ఆత్మాభిమానం గల ఎస్సీ, ఎస్టీ, బీసీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు పేర్కొన్నారు.
గతంలో కూడా రేవంత్ రెడ్డి బీసీలు కేవలం జెండాలు మోసే కార్యకర్తలే అని సంచలన వ్యాఖ్యలు చేసారని , ఆ విషయంపై అధిష్టానానికి 3 పేజీల లేక పంపినా… ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు రామూ గౌడ్. కాంగ్రెస్‌లో బడుగు బలహీన వర్గాలకు బతుకులేదని, దొర పాలన. నియంత పాలన కాంగ్రెస్ లోనే ఉందని , రాజశేఖర్ రెడ్డి పాలనలో ఉన్న కాంగ్రెస్ వేరు.. ఇప్పటి కాంగ్రెస్ వేరన్నారు. మల్కాజ్‌గిరి డీసీపీ ప్రెసిడెంట్ కూడా రేవంత్ రెడ్డి మాటాలు వినే కీలు బొమ్మలా పని చేస్తున్నడన్నారు. అందుకే పార్టీకి రాజానామా చేస్తున్నానన్నారు రామా గౌడ్. రేపు బెంగుళూరు లో షర్మిల సమక్షంలో YSRTP లో చేరుతున్నట్టు ప్రకటించారు. తెలంగాణలో రాజన్న పాలన షర్మిలక్కతోనే సాధ్యమన్నారు. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు వెల్లండించారు. రామా గౌడ్‌తో పాటు నానీ, రాజ్‌కుమార్‌లు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు సమాచారం.