అమెరికా కార్చిచ్చుపై స్టార్ హీరోయిన్ కీలక వ్యాఖ్యలు
స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో చెలరేగిన కార్చిచ్చుపై స్పందించారు. ఇంతటి కష్టకాలంలో ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడుతున్న అగ్నిమాపక సిబ్బందే నిజమైన హీరోలను వ్యాఖ్యానించారు. తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, వినాశకరమైన లాస్ ఏంజిల్స్ అడవి కాలి, నివాసాలు సైతం అంటుకుపోవడం, ప్రజలు రోడ్డున పడ్డ విషయంపై తన బాధను వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం నుండి తన కుటుంబాన్ని కాపాడిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. తన గుండె బరువెక్కిందని పేర్కొంటూ, అగ్నిప్రమాదం తర్వాత అవశేషాల కొన్ని ఫొటోలు, వీడియోలను ఆమె షేర్ చేశారు. ఆమె క్యాప్షన్‌లో, తన స్నేహితులు, సహోద్యోగులు, తోటి కళాకారులు, ఫిల్మ్ యాక్టర్లు తమ ఇళ్లు, ప్రజలను కోల్పోయారని పేర్కొంది. సమాజాన్ని తిరిగి ఆర్థికంగా కొంచెం పుంజుకునేలా చేసేందుకు కృషి చేస్తున్న కొన్ని సంస్థలకు విరాళాలు ఇవ్వాలని ఆమె ప్రజలను కోరుతున్నారు.
Breaking news: ఇస్రో చరిత్రలో భారీ విజయం

