నిలిచిపోయిన మెట్రో ట్రైన్
హైదరాబాద్ లో ఒక్కసారిగా మెట్రో ట్రైన్ నిలిచిపోయింది. మియాపూర్ టూ ఎల్బీ నగర్ రూట్‌లో మెట్రో ట్రైన్ ఆగిపోయింది. సాంకేతిక సమస్యల కారణంగా దాదాపు 20 నిమిషాల పాటు భరత్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద మెట్రో ట్రైన్ నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అయితే.. ఈ మధ్య కాలంలో సాంకేతిక సమస్యల కారణంగా తరచూ మెట్రో రైలు మొరాయిస్తున్నాయి.

