భద్రాద్రిలో ఘనంగా శ్రీరామ పుష్కర పట్టాభిషేకం- హాజరైన గవర్నర్ తమిళిసై
భద్రాద్రిలో నిన్న శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారామ కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. కాగా నేడు విశిష్ఠమైన శ్రీ రామపట్టాభిషేక మహోత్సవం జరిగింది. దేశంలోని పుణ్యనదుల్లో, పుణ్యక్షేత్రాలలోని పుష్కరుణలోని పవిత్రజలాన్ని తెచ్చి జలాలను అభిషేకం చేశారు. అనంతరం పవిత్ర గోదావరిలోని జలాలతో అభిషేకించారు. గడచిన అరవయ్యేళ్లుగా ఈ కళ్యాణ మహోత్సవాలను వైభవంగా జరుపుతున్నారు. ఈ పట్టాభిషేక మహోత్సవంలో తెలంగాణా గవర్మర్ తమిళిసై పాల్గొన్నారు. శ్రీసీతారాములకు వస్త్రాలు సమర్పించారు. ఈ శోభకృత్ నామ సంవత్సరంలోనే సీతమ్మ తల్లి అవతరించిందని, అందుకే ఈసారి జరిగే ఈ పట్టాభిషేకానికి ప్రత్యేకత ఉందని పండితులు తెలియజేస్తున్నారు. శ్రీరామునికి పట్టాభిషేక సందర్భంగా రాజమకుట ధారణతో పాటు సీతమ్మకు కూడా రాజ్ఞి మకుట ధారణను చేశారు.

