ఏపీలో అవయవదానంపై ప్రత్యేక మార్గదర్శకాలు
అవయవదానంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అవయవదానాన్ని ప్రోత్సహించడానికి బ్రెయిన్ డెడ్ కేసులపై అవయవాల సేకరణకు తాజా మార్గదర్శకాలను రూపొందించింది. జీవన్ దాన్ కార్యక్రమంలో నమోదైన ఆసుపత్రుల నుండి జిల్లా కలెక్టర్, ప్రభుత్వ ఆసుపత్రుల డీన్‌లకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. ఏపీ స్టేట్ ఆర్గాన్ టిష్యూస్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆర్గనైజేషన్‌కు ఆలస్యం అవకుండా సమాచారం ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. జీవన్మృతుడికి సంబంధించిన భౌతికకాయానికి తగిన గౌరవం ఇచ్చి, అంత్యక్రియలు రాష్ట్రప్రభుత్వం తరపున నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ అంత్యక్రియలకు 10 వేల ఆర్థిక సహాయంతో పాటు ప్రభుత్వ ప్రతినిధిగా జిల్లా కలెక్టర్ హాజరవుతారని పేర్కొన్నారు.