HealthHome Page SliderNational

పిజ్జా, బర్గర్లు ఎక్కువగా తింటే ఏమవుతుంది?

Share with

రుచిగా ఉన్నాయని కొందరు, ఫ్యాషన్‌కి కొందరు ఈ మధ్యకాలంలో పిజ్జాలు, బర్గర్లు లాంటి ఫాస్ట్‌ఫుడ్స్ ఎక్కువగా తింటున్నారు. అయితే వీటి వల్ల ఆరోగ్యానికి ప్రమాదం కలుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక చక్కెర, కొవ్వులు ఉండే ఈ పదార్థాల వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడవచ్చు. బర్గర్లు ఎక్కువగా తినేవారికి మధుమేహం వచ్చే అవకాశం ఉంది. చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగి, క్యాలరీలు పెరిగిపోతాయి. వీటివల్ల చెడు కొలెస్ట్రాల్ కూడా పెరిగే ప్రమాదం ఉంది. చిన్న వయసులోనే గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇవి తినే ఆడ పిల్లలో బరువు వేగంగా పెరిగి, ముందుగానే వయసుకు వచ్చే అవకాశం ఉంటుంది. వీటివల్ల హైబీపీ, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడతాయి. కిడ్నీలలో స్టోన్స్ ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. అందుకే దీర్ఘకాల రోగాలకు గురి కాకుండా వీటికి దూరంగా ఉంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.