శాసనసభ ప్రాంగణంలో స్పీకర్
భారతదేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శాసనసభ ప్రాంగణంలో జాతీయ జెండాను ఎగురవేశారు తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్. ముందుగా రాజ్యాంగ నిర్మాత డా. బి ఆర్ అంబేద్కర్, జాతిపిత మహాత్మాగాంధీ గార్ల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, లేజిస్లేటివ్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు, చీఫ్ మార్షల్ కర్ణాకర్, శాసనసభ్యులు, అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

