కరాటే ఆడిన స్పీకర్, మంత్రి..
తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్రభాకర్‌లు కరాటే ఫైట్ చేశారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో 4వ కరాటే నేషనల్ పోటీలు ప్రారంభమయ్యాయి. వీటిని ప్రారంభించిన వీరిద్దరూ సరదాగా కరాటే డ్రెస్సులు ధరించి ఫోజులిచ్చారు. పలువురు బాల బాలికలు ఈ పోటీలలో పాల్గొన్నారు. పోటీల అనంతరం విన్నర్స్‌కు బహుమతులు ప్రధానం చేశారు.



