ఏపీని తాకిన నైరుతి రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఆదివారం రాయలసీమలోని పలు ప్రాంతాలను ఋతుపవనాలు తాకాయి. ఋతుపవనాలు కేరళ ను తాకిన తర్వాత ఏపీకి రావడానికి సాధారణంగా నాలుగు రోజులు సమయం పడుతుంది. ఈ నెల 8వ తేదీన అవి కేరళ లో ప్రవేశించగా 12వ తేదీ నాటికి ఏపీకి వస్తాయని భావించారు. కానీ బీపర్ జోయ్ తుఫాన్ కారణంగా అవి చురుగ్గా కదలటంతో ఒకరోజు ముందుగానే ఏపీని తాకాయి. ఆదివారం తిరుపతి జిల్లా శ్రీహరికోట మీద ఏపీ లోకి ప్రవేశించాయి వచ్చే 48 గంటల్లో అవి రాయలసీమలో మిగిలిన ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. వారం రోజుల్లో మొత్తం రాష్ట్రమంతా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రుతుపవనాల వల్ల ఈసారి సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది.

