Andhra PradeshHome Page Slider

త్వరలో 3,200 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల: మంత్రి బొత్స

ఏపీ లోని యూనివర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో 3,200 ఉద్యోగాల భర్తీకి నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

అమరావతి: రాష్ట్రంలోని యూనివర్శిటీలు, ట్రిపుల్ ఐటీల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి మంత్రి బొత్స సత్యనారాయణ కీలక అప్‌డేట్ ఇచ్చారు. 3,200 ఉద్యోగాల భర్తీకి సంబంధించి నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్ వచ్చేడట్లు చేస్తాం. అలాగే, రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని చెప్పారు. తొలుత టెట్, ఆ తర్వాత డీఎస్‌సీ నిర్వహించనున్నట్టు బొత్స ట్వీట్ చేశారు. యూనివర్సిటీల్లో 18 ఏళ్లుగా శాశ్వత ఉద్యోగాల భర్తీ జరగలేదన్న ఆయన.. యూనివర్సిటీలు, ట్రిపుల్ ఐటీలలో ఖాళీగా ఉన్న 3,200 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఏపీపీఎస్‌సీ ద్వారా పరీక్షలు నిర్వహించి నియామకాలు చేపట్టనున్నట్టు తెలిపారు.

       ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థులకు బైజూస్‌తో బోధనకు ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని బొత్స తెలిపారు. కంటెంట్ మొత్తం బైజూస్ ఉచితంగానే ఇస్తోందని.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కడా ఆ సంస్థకు చెల్లించక్కర్లేదన్నారు.